ప్రూనింగ్ మరియు ట్రైనింగ్ (కత్తిరింపులు)

           మొక్క క్రింది నుంచి 50 సేం.మీ. వరకు ఎటువంటి కోమ్మలను రానియకుడదు. ప్రధాన కాండంపై 2 లేదా ౩ బలమైన కొమ్మలను ఎన్నుకొని పెరగనివ్వాలి. మిగతావి తీసివేయాలి. పక్క కొమ్మల పొడవు 60-80 సేం.మీ. లు ఉండేలా కత్తిరించుకోవాలి. ఈ విధంగా నిర్ధారించిన ఆకారం వచ్చే వరకు చేయాలి. పెద్దచేట్లలో ప్రతి సంవత్సరం కాయకోత తర్వాత జూన్ – జూలై మాసాల్లో అడ్డదిడ్డంగా పెరిగే కొమ్మలను, ఎండిపోయిన కొమ్మలను, రెమ్మలను తీసివేయుట వలన సూర్యారశ్మీ చెట్టంతా బాగా సోకి మంచి కాపునిస్తుంది. కాయ వదిలేసినా తోడిమలను కత్తిరించాలి. కత్తిరింపులు చేసిన తర్వాత ప్రతి ఒక రెమ్మ చివరి నుండి ౩-5 చిగిర్లు వస్తే రెండింటిని నిలుపుకొని మిగిలిన వాటిని తీసివేయాలి.

           పిందె రాలకుండా తగ్గించడానికి ఒక గ్రాము నాఫ్తలిన్ ఎసిటిక్ ఆమ్లాన్ని 10 మీ.లీ. మిధనాల్లో కరిగించి తర్వాత  50 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి. లేదా 2, 4-డి-10 పి.పి.యం. (1 గ్రా. 2, 4-డి పొడిని 100 లీటర్ల నీటిలో కలిపి ) ద్రావణాన్ని పిచికారి చేయాలి.